ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షేనా?

Written by

in


ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వ కారణం అన్నట్లుగా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎక్కడ చూసినా వైద్యుల కొరత, మందుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి సత్య కుమార్ ఉన్నప్పటికీ కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సరైన సదుపాయాలు మరియు మందులు లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న కరెంటు లేక ఆక్సీజన్ అందక ఒక వ్యక్తి చనిపోయారు. జనరేటర్ ఉన్నా పనిచేయదు, ఏసీలు ఉన్నా పని చేయవు, అక్కడక్కడ ఫ్యాన్లు పనిచేయవు, డాక్టర్లు ఉన్నా సమయపాలన పాటించరు, ఇవన్నీ చూస్తూ పట్టనట్లు ఉంటున్న విలేకరులు, రికమండేషన్ ఉంటేనే మెరుగైన వైద్య సేవలు, మరి పేదల పరిస్థితి ఏంటి? అందుకే AP 39 TV ప్రజల పక్షాన మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మా ప్రతినిధి అందుబాటులో ఉంటారు. పేద ప్రజలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:6281713012

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *